బేతిగల్ గ్రామం పాడి పంటలతో విరసిల్లాలని ఆకాంక్ష
బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్న వొడితల ప్రణవ్
వీణవంక: వీణవంక మండలంలోని బేతిగల్ గ్రామంలో భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి, పోచమ్మ తల్లుల విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు.
దేవాలయంలో ప్రత్యేక పూజలు
అనంతరం శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రణవ్, గ్రామదేవతల ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. “ఊరిని కంటికి రెప్పలా కాపాడుకునే గ్రామదేవతల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉంది” అని అన్నారు.
ప్రతిష్ఠ మహోత్సవం ఘనవిజయం
ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులను ప్రణవ్ అభినందించారు. ఈ మహోత్సవానికి తనవంతు సహకారం అందజేశారు.
ఈ కార్యక్రమంలో బేతిగల్ గ్రామశాఖ కాంగ్రెస్ నాయకులు, వీణవంక మండల నాయకులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
