నిరుద్యోగ నిర్మూలనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక కృషి..
దేశ చరిత్రలోనే ఒక్క ఏడాదిలో 55 వేల ఉద్యోగుల భర్తీ..
బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఏనాడైనా ఇలా ఉద్యోగాలు కల్పించారా..?
కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి.
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు
కరీంనగర్:గ్రాడ్యుయేట్స్, నిరుద్యోగులకు నిరంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి గ్రాడ్యుయేట్స్ కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తోనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని తెలిపారు.
మంగళవారం వెలిచాల రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహర్నిశలు పాటు పడుతున్నారని పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసిందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించలేదని, కేవలం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్లకు, నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని, ఇతర పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి మోసపోవద్దని సూచించారు. ఇతర అభ్యర్థులు చెబుతున్న మోసపూరిత హామీలను నమ్మవద్దని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రాడ్యుయేట్లను కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బిజెపి నాయకులు లేనిపోని హామీలు గుప్పిస్తూ గ్రాడ్యుయేట్లను మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారని, వారి పట్ల జాగ్రత్తగా వ్యవ హరించాలని సూచించారు. బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ల సమస్యల పరిష్కారానికి ఏ మేరకు కృషి చేశారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ఇక్కడ మాత్రం అనేక హామీలు ఇస్తూ గ్రాడ్యుయేట్లను మోసం చేసేందుకు బిజెపి నేతలు వస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తేనే గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం అవుతాయని, గ్రాడ్యుయేట్లు కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరారు. నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ నిర్మూలనకు పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నదని చెప్పారు. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా తయారు చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నదని తెలిపారు. ఇందుకోసం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గ్రాడ్యుయేట్లు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాజేందర్ రావు కోరారు.
