
గిన్నిస్ రికార్డులో కరీంనగర్ కూచిపూడి కళాకారులకు స్థానం
కరీంనగర్‌కు చెందిన కూచిపూడి నృత్య కళాకారులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి జిల్లా ప్రతిష్టను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. కూచిపూడి నృత్య గురువు వేలుపుల స్వప్న కుమారి ఆధ్వర్యంలో కరీంనగర్‌కు చెందిన పలువురు కళాకారులు ఈ చారిత్రాత్మక ఘనతలో భాగస్వాములయ్యారు.

హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ‘కూచిపూడి కళావైభవం–2’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 4,608 మంది కళాకారులు ఒకేసారి 40 నిమిషాల పాటు కూచిపూడి నృత్యం చేసి కొత్త గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి వచ్చిన కళాకారులు కూడా పాల్గొని నాట్యప్రదర్శనను ఘనంగా నిర్వహించారు.
ఇంతకుముందు 2023లో ఇదే అకాడమీ ఆధ్వర్యంలో 4,218 మందితో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన గిన్నిస్ రికార్డులోకి ఎక్కగా, తాజాగా ఆ రికార్డును అధిగమించడం విశేషం. ఈ సందర్భంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి స్వప్నిల్ కళాకారులకు అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.
ఈ విజయంతో కరీంనగర్‌కు చెందిన కూచిపూడి కళాకారుల ప్రతిభకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని కళారంగ ప్రముఖులు అభినందనలు తెలిపారు.

Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
