టేకుమట్ల మండలం, అంకుషాపూర్ గ్రామానికి చెందిన యువజన కాంగ్రెస్ కార్యకర్త పండగ అనిల్ ఇటీవల మృతి చెందగా, ఆయన అంతిమయాత్రలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని పాడ మోసిన విషయం తెలిసిందే.
శుక్రవారం రోజున అనిల్ దశదినకర్మ సందర్భంగా, మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టేకుమట్ల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ నాయకులు కలిసి పండగ అనిల్ కుటుంబానికి రూ. 35,000 లు ఆర్థిక సాయం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కార్యకర్తలతోనే ఉంటుందనే భరోసా ఇచ్చారు. కార్యకర్తల కుటుంబాల్లో ఎవరికైనా ఆపద వచ్చినా, మండల కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
కోటగిరి సతీష్ గౌడ్ స్పందన:
“నాతోటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, బాధిత కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటుందని నేను స్పష్టంగా చెబుతున్నాను.”
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
