
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన సవాల్
హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం తనపై చేసిన ఆరోపణలను ఖండిస్తూ ఆయన ధీమాతో సవాల్ విసిరారు.కరీంనగర్ సిటీ పోలీస్ కమిషనర్ మత మార్పిడి చేస్తున్నారని తాను ఎప్పుడూ అనలేదని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. ఐపీఎస్ అధికారుల సంఘం చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, అవన్నీ పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. తాను అలాంటి వ్యాఖ్య చేసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేసి, శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఘాటుగా ప్రకటించారు.అదే సమయంలో, ఆరోపణలు తప్పని తేలితే తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం నాయకులు పబ్లిక్‌గా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే తాను ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తానని హెచ్చరించారు.ఈ అంశంపై వీడియో సందేశాన్ని ఆయన విడుదల చేసి, X (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు భారీగా వీక్షణలు, లైక్‌లు, రీపోస్ట్‌లు వస్తుండటంతో విషయం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంపై ఐపీఎస్ అసోసియేషన్ నుంచి ఇంకా అధికారిక స్పందన రాలేదు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
