హైదరాబాద్, జీడిమెట్ల: ఏసిబి అధికారులు తెలంగాణలో మరో అవినీతి అధికారిని బట్టబయలు చేశారు. టీ.జి.పి.సి.ఎల్, జీడిమెట్ల డివిజన్ లో అసిస్టెంట్ ఇంజనీర్ (ఏ.ఇ.) ఎస్. సురెందర్ రెడ్డి ఫిర్యాదుదారుని భవనానికి కేబుల్ వేయడం, 11 KV లైన్‌ను తరలించేందుకు రూ.30,000/- లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారుల చేతికి చిక్కాడు.
ఫిర్యాదుదారు లంచం కోసం ఒత్తిడి చేస్తున్న అధికారిపై 1064 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయగా, ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగారు. అధికారిని పసిగట్టిన ఏసీబీ, డబ్బు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
అవినీతిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
తెలంగాణలో అవినీతికి చోటివ్వకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏ ప్రభుత్వాధికారి లంచం డిమాండ్ చేసినా ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.
అవినీతికి చెక్ పెట్టేద్దాం – భవిష్యత్తును స్వచ్ఛంగా ఉంచుదాం!
