హైదరాబాద్: ఏసీబీ (యాంటీ కరప్షన్ బ్యూరో) అధికారుల పేరుతో కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఫేక్ కాల్స్ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ మోసపూరిత చర్యలపై ఏసీబీ డైరెక్టర్ జనరల్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
ఏసీబీ అధికారిక ప్రకటన:
▪️ఏసీబీ అసలు అధికారికంగా డబ్బులు డిమాండ్ చేయదు.
▪️ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు ఇలాంటి ఫేక్ కాల్స్ నమ్మకూడదు.
▪️అలాంటి నకిలీ కాల్స్ కు స్పందించి ఎవరూ డబ్బులు చెల్లించకూడదు.
▪️ఏదైనా అనుమానాస్పద కాల్ వచ్చిన వెంటనే అధికారికంగా ఫిర్యాదు చేయాలి.
ఫిర్యాదు చేయడానికి అధికారిక మార్గాలు:
➡ టోల్ ఫ్రీ నెంబర్: 1064
➡ WhatsApp: 9440446106
➡ Facebook: “తెలంగాణ ACB”
➡ X (ట్విట్టర్): @TelanganaACB
➡ స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయవచ్చు.
గమనిక: ఫిర్యాదుదారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి.
ప్రజలు అప్రమత్తంగా ఉండండి – మోసపూరిత కాల్స్‌ను నమ్మొద్దు!
