బెజ్జంకి: జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆదేశం, మండలాధ్యక్షుడు కొలిపాక రాజు సూచన మేరకు, గ్రామ ప్రభరి గాండ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ & టీచర్స్ ఎన్నికల ఇంటి ఇంటా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా కరీంనగర్, మెదక్, నిజామాబాద్, అదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి మరియు టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.ఎమ్మెల్సీ మండల ఇంచార్జీ సాన వేణు మాట్లాడుతూ, “గ్రాడ్యుయేషన్ ఓటర్లు బీజేపీ వైపే చూస్తున్నారు. పెద్ద ఎత్తున మద్దతు పెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది. నిరుద్యోగులను మరోసారి మోసం చేసిన ప్రభుత్వం త్వరలో గుణపాఠం నేర్చుకుంటుంది” అని వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో మండల ప్రభారీలు దారం సతీష్ రెడ్డి, శివచరణ్, వినీత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
