ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుక – సామాన్యులకు తక్కువ ధర
ఇసుక మాఫియాపై కఠిన చర్యలు
వినియోగదారులకు వేగవంతమైన సేవలు
తెలంగాణలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టడానికి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమస్యపై ఆయన గనులు & ఖనిజాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు.
ఇసుక మాఫియాపై కఠిన చర్యలు
అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని సీఎం ఆదేశించారు.
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణాను అరికట్టే బాధ్యత హైడ్రాకు అప్పగించారు.
ఈ అక్రమ కార్యకలాపాలకు సహకరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుక – సామాన్యులకు తక్కువ ధర
ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా ఇసుక అందించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
సామాన్య వినియోగదారులకు తక్కువ ధరలో ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ఇసుక రవాణాపై కట్టుదిట్టమైన నిఘా
అక్రమ రవాణాపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ నిఘా ఏర్పాటు చేయాలి.
ప్రతి ఇసుక రీచ్ వద్ద 360° కెమెరాలు, సోలార్ లైట్స్ ఏర్పాటు చేయాలి.
స్టాక్‌యార్డుల వద్ద కఠినమైన ఫెన్సింగ్ & కంట్రోల్ ఎంట్రీ/ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఇసుక రవాణా చేసే వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ అమలు చేయాలని సీఎం సూచించారు.
వినియోగదారులకు వేగవంతమైన సేవలు
ఇసుక బుక్ చేసిన 48 గంటల్లోగా డెలివరీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
ఆన్లైన్ బుకింగ్ విధానంలో మార్పులు చేసి, ఆఫీస్ టైమింగ్స్‌లో బుకింగ్ చేసుకునేలా సౌకర్యం కల్పించాలి.
ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి తో పాటు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
—
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
