వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ వడ్లకే దిక్కులేకపోతే… సాధారణ రైతుల పరిస్థితి ఎలా ఉంటుంది?

పెబ్బేరు, జూన్ 13 (జిందగీ 9 న్యూస్): పెబ్బేరు మండలం రామాపురం గ్రామంలో వడ్ల కొనుగోలు విషయంలో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డు డైరెక్టర్ షాహిన్ ఉషన్ పీర్, మహేష్ రెడ్డి, శివారెడ్డి వంటి రైతులవారు దాదాపు 700 సంచుల వడ్లను కాంట్ చేసిన 14 రోజులు గడుస్తున్నా… ఇవి ఇప్పటికీ మిల్లులకు తరలించకుండా అలాగే వదిలివేశారు.

వర్షాలతో వడ్లు తడిసి పాడవుతున్నాయి. దాంతో రైతులు సంచులను తిరగేసి, ఆరబెట్టే ప్రయత్నంలో అలసిపోతున్నారు. తాము అధికారులకు ఎంత చెప్పినా స్పందన లేదు. ఐకేపీ సిబ్బంది “మేమేం చేయలేం” అంటూ చేతులెత్తేస్తున్నారు.
“మా వడ్లు చీలిపోతున్నాయి… అయినా ఎవరికీ పట్టట్లేదు. మనది రైతు రాజ్యమా లేక బేసరయిన పాలనా?” అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇది చూస్తుంటే ఇందిరమ్మ రాజ్యంలో అధికారుల నిర్లక్ష్యం వల్లే రైతుల కన్నీళ్లు కారాల్సి వస్తోంది అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ వడ్లను మిల్లుకు తరలించలేని పరిస్థితిలో ఉంటే, సాధారణ రైతుల స్థితిగతులు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు!
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
