మీకు మేము గ్యారంటీ ఉంటాం..
కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి రోహిత్ చౌదరిని గెలిపించండి..
ఢిల్లీలో వెలిచాల రాజేందర్ రావు గడప గడప ఎన్నికల ప్రచారం..
ఓటర్లను ఆకట్టుకుంటూ ముందుకు..
ఆమ్ ఆద్మీ, బిజెపి కుమ్మక్కై ఢిల్లీ ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపాటు..
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు రెండో రోజు శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాంగ్లోయ్ జాట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి రోహిత్ చౌదరికి మద్దతుగా లక్ష్మీ పార్క్, ఎఫ్ హెచ్ బ్లాక్ లో ఇంటింటికీ, గడపగడపకు వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెలిచాల రాజేందర్ రావు మాట్లాడుతూ నిత్యం ప్రజల్లో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేసే రోహిత్ చౌదరిని భారీ మెజార్టీతో గెలిపించాలని స్థానికులకు వెలిచాల విజ్ఞప్తి చేశారు. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ విధానాల వల్ల విధ్వంసమైన ఢిల్లీ పునరుజ్జీవం కోసం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని కోరారు. ఆ రెండు పార్టీలు కలిసి ఢిల్లీ ప్రజలను మోసం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఒకరికొకరు పరస్పర సహకారంతోనే ఆ రెండు పార్టీలు పనిచేస్తున్నాయని ఓటర్లకు వివరించారు. కాంగ్రెస్ పార్టీతోనే దేశ భవిష్యత్తు మెరుగ్గా ఉంటుందని ఈసారి కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తున్నదని, ఢిల్లీ గడ్డపై కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేస్తే ఇక్కడ కూడా గ్యారంటీలు అమలు అవుతాయని భరోసా కల్పించారు. ప్రధానంగా స్ట్రీట్ వెండర్స్, బస్తీలు, వివిధ మార్కెట్లలో వెలిచాల రాజేందర్ రావ్ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఢిల్లీ మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. దేశంలో అభివృద్ధికి బాటలు వేసిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. ఇందుకు రోహిత్ చౌదరిని ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. వెలిచాల రాజేందర్ రావు వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
