అల్ఫోర్స్ హై స్కూల్లో కృత్రిమ మేధస్సుపై అవగాహన సదస్సు

కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో హై స్కూల్ (CBSE) ప్రాంగణంలో కృత్రిమ మేధస్సుపై అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ –
‘‘నేటి విద్యావ్యవస్థలో కృత్రిమ మేధస్సు (AI) కు అత్యంత ప్రాధాన్యత ఉంది. ప్రతి ఉపాధ్యాయుడు దీనిపై విస్తృత అవగాహన కలిగి ఉండటం అవసరం’’ అన్నారు.
సీబీఎస్ఇ నిపుణులు బి. రవి కిరణ్, చారు దింగ్రా మాట్లాడుతూ,
స్వీడన్, అమెరికా, బ్రిటన్, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో కృత్రిమ మేధస్సు రంగంలో చేస్తున్న అభివృద్ధి పనితీరును ప్రస్తావించారు. అల్ఫోర్స్ విద్యా సంస్థల్లో కూడా AI ని అమలుచేయడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.
సదస్సు ప్రారంభానికి ముందు అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉపాధ్యాయులు రూపొందించిన చిత్ర ప్రదర్శనలతో పాటు వారి ఆలోచనలు సభికులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ అవగాహన సదస్సు ద్వారా ఉపాధ్యాయుల్లో కృత్రిమ మేధస్సు పై ఆసక్తి పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించారని నిర్వాహకులు తెలిపారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
