డోన్: డోన్ పట్టణంలోని కొండపేట శేగు టాకీస్ పరిసరాల్లో యాచిస్తూ జీవనం సాగిస్తున్న అనాధ వృద్ధుడు శివరాత్రి పర్వదినాన కన్నుమూశాడు. ఈ విషయం తెలిసిన ద్రోణాచలం సేవా సమితి సభ్యులు, డోన్ టౌన్ సీఐకి సమాచారం అందించి, హిందూ సంప్రదాయం ప్రకారం హిందూ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
సేవా కార్యక్రమంలో ముఖ్యపాత్రధారులు🔹
🔸ఈ పుణ్యకార్యానికి కావాల్సిన ఖర్చును వైఎస్సార్సీపీ నాయకుడు మల్యాల శ్రీనివాసరెడ్డి భరించారు.
🔸ప్రతి సారి మాదిరిగానే రాజయ్య గౌడ్ వైకుంఠ రధం సమకూర్చారు.
🔸107వ ఆత్మబంధువు అంత్యక్రియలను ద్రోణాచలం సేవా సమితి సభ్యులు షాదీఖానా రాజా, తాహెర్ బాషా, సయ్యద్ వలి, శివారెడ్డి, రసూల్, షబ్బీర్ లు నిర్వర్తించారు.
🔹ద్రోణాచలం సేవా సమితి అనాథల ఆత్మ బంధువుగా మారి వారికి అండగా నిలుస్తూ వస్తుండటం సమాజానికి ఆదర్శంగా నిలుస్తోంది.
