కొల్లాపూర్: కొల్లాపూర్ చౌరస్తా వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నాచహెల్లి గ్రామానికి చెందిన విష్ణు చారి (57) తీవ్ర గాయాలపాలై మృతి చెందారు.
వివరాల ప్రకారం, విష్ణు చారి, తండ్రి బాలకిష్టన్నా, వృత్తి కార్పెంటర్, కొల్లాపూర్ వైపు నడుచుకుంటూ వెళుతుండగా, వెనుక వైపు నుంచి AP 39 UC 7200 నంబర్ గల సిమెంట్ లారీ అతడిని ఢీకొట్టింది. లారీ అతి వేగంగా, అజాగ్రత్తగా నడపడం వల్ల ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.
ప్రమాదంలో విష్ణు చారి ఎడమ చెయ్యి, ఎడమ కాలు తీవ్రంగా గాయపడ్డాయి. 108 అంబులెన్స్ ద్వారా బాధితుడిని వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు.
మృతుడి కుమార్తె శైలజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
