భయానికి చెక్.. ఫిర్యాదుకు డిజిటల్ టచ్.. ‘సేతు’

హైదరాబాద్: పోలీస్ స్టేషన్‌కు వచ్చే సామాన్య ప్రజల్లో భయాందోళనలు తొలగించి, పోలీస్ సేవలను మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లో ఏఐ ఆధారిత ‘సేతు’ స్మార్ట్ కియోస్క్‌ను ప్రారంభించారు. మెహదీపట్నం పోలీస్ స్టేషన్లో ఈ వ్యవస్థను పైలట్ ప్రాజెక్టుగా అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. బాధితులు తమకు అనుకూలమైన భాషలో తమ సమస్యను స్వేచ్ఛగా వివరించేలా ‘సేతు’ను రూపొందించినట్లు తెలిపారు. ఫిర్యాదును డిజిటల్‌గా నమోదు చేసుకోవడంతో పాటు, విచారణ పురోగతిని పారదర్శకంగా తెలుసుకునే అవకాశం ఈ వ్యవస్థ ద్వారా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
పోలీస్ స్టేషన్ రిసెప్షన్ వద్దే ప్రజలకు గౌరవప్రదమైన, సత్వర సేవలు అందేలా ‘సేతు’ పనిచేస్తుందని సజ్జనార్ తెలిపారు. ప్రజలకు, పోలీసులకు మధ్య నమ్మకాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ సాంకేతిక వ్యవస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
త్వరలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లకు ‘సేతు’ సేవలను దశలవారీగా విస్తరించనున్నట్లు తెలిపారు. నగర ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని, తమ సూచనలు అందించి ప్రజాహిత పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలని సజ్జనార్ కోరారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
