రామగుండం రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

రామగుండం, సెప్టెంబర్ 16: రామగుండం రైల్వే స్టేషన్ దాటిన తర్వాత రైల్వే ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ సమీపంలోని రైలు పట్టాల పక్కన సిమెంట్ కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి వయసు సుమారు 40 నుంచి 45 సంవత్సరాలు ఉంటుందని రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండగా, రెండు లేదా మూడు రోజుల క్రితం రైలు నుంచి ప్రమాదవశాత్తు కిందపడటంతో మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
మృతుడు నలుపు రంగు ఫుల్ టీషర్ట్, లైట్ బ్లూ రంగు జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. అతని వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు, ఇతర వస్తువులు లభించలేదు. మృతదేహాన్ని రామగుండం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు.
ఈ కేసుపై ప్రభుత్వ రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ జి. తిరుపతి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు లేదా తమ కుటుంబ సభ్యులు ఎవరైనా కనిపించకుండా పోయినట్లు తెలిసిన వారు 9949304574, 8712658604 నంబర్లకు సమాచారం అందించాలని రైల్వే పోలీసులు కోరారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
