బార్బర్స్ డే సందర్భంగా ఘనంగా జెండా ఆవిష్కరణ

జూలూరుపాడు, సెప్టెంబర్ 16: వైరా నియోజకవర్గంలోని జూలూరుపాడు మండల కేంద్రంలో సెప్టెంబర్ 16న బార్బర్స్ డే సందర్భంగా నాయి బ్రాహ్మణ సేవా సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు, మహిళలు, పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కడియాల సత్యనారాయణ హాజరై సంఘం జెండాను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు కుదురుపాక నిర్మల, జిల్లా నాయకులు కొల్లిపాక వెంకటేశ్వర్లు, జిల్లా యూత్ సహాయ కార్యదర్శి మార్కాపూరి నరసింహారావు, డివిజన్ సహాయ కార్యదర్శి వల్లోజి రమేష్, వైరా నియోజకవర్గం ఇన్చార్జి మాడుగుల నాగరాజు, కో-కన్వీనర్ కడియాల పుల్లయ్య, జూలూరుపాడు మండల అధ్యక్షుడు కడియాల శ్రీను, కార్యదర్శి పెద్దవరపు కృష్ణార్జునరావు, ఉపాధ్యక్షులు మాడుగుల నరేష్ పాల్గొన్నారు.
అలాగే సంఘం పెద్దలు శేషాద్రి రాములు, కడియాల మని, కుదురుపాక సీతారాములు, నాగేశ్వరరావు, బుచ్చిబాబు, దయాకర్, మధు, హరీష్, వల్లోజి నాగరాజు, లక్ష్మయ్య, మార్కాపూర్ రాంబాబు, కడియాల ఆనందరావు, కడియాల వెంకన్న, మాదాపూర్ సతీష్, ఉబ్బనపల్లి నరేష్, మార్కాపూర్ సురేష్, హరికృష్ణ, ఉప్పర్ల నరసింహారావు, కడియాల నరేష్, కడియాల కృష్ణ, రామవరపు కిరణ్, నీదికొండ నరసింహారావు, ప్రేమ్, లతీపు, సైదులు, సత్తిపండు, నాగేశ్వరరావు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మహిళా సంఘం తరఫున కడియాల లక్ష్మి, ఉమా, శ్రీలత, జీవిత తదితరులు హాజరయ్యారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
