సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద విద్యుత్ స్తంభాలు, లైట్లు ఏర్పాటు చేయాలి
విద్యుత్ శాఖ అధికారులతో పరిసరాల పరిశీలన

జూలూరుపాడు, సెప్టెంబర్ 11 (Zindagi9News): పడమట నర్సాపురం గ్రామంలోని సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద భక్తులు, గ్రామ ప్రజలకు ఇబ్బందులు లేకుండా విద్యుత్ స్తంభాలు, లైట్లు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు లేళ్ల గోపాల్‌రెడ్డి కోరారు.ఈ మేరకు జూలూరుపాడు విద్యుత్ శాఖ ఏఈ, లైన్మెన్లను గద్దెల వద్దకు పిలిపించి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. గద్దెల చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, లైట్ల ఏర్పాటుకు అవసరమైన ఎస్టిమేషన్ తయారు చేసి, మ్యాప్ రూపొందించాలని అధికారులను కోరారు.గద్దెల వద్ద భక్తులు, గ్రామ ప్రజలకు రాత్రి వేళల్లో ఇబ్బందులు కలగకుండా తగినన్ని లైట్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నాయకులు వివరించిన సమస్యలను విన్న విద్యుత్ శాఖ ఏఈ స్పందిస్తూ.. త్వరలోనే విద్యుత్ స్తంభాలు, లైట్లు ఏర్పాటు అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బాదావత్ హరీష్, మొగిలిపువ్వు శ్రీనివాసరావు, 7వ వార్డు సభ్యుడు బాదావత్ నాగరాజు, కుసుమరాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Zindagi9News
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
