నా కూతురు జీవితం తన ఇష్టం.. ఆమెను వద్దని చెప్పే అధికారం నాకు లేదు : మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్, సెప్టెంబర్ 2: తన కూతురు విషయంలో మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. తన కూతురు స్వతంత్రంగా నిర్ణయం తీసుకుని మాట్లాడిందని, ఆమె జీవితంపై నిర్ణయం తీసుకునే అధికారం తనకు లేదని స్పష్టం చేశారు.
“నా కూతురికి పెళ్లైంది. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది. తనను వద్దు అని చెప్పే అధికారం నాకు లేదు. తన జీవితం.. తన ఇష్టం” అని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు.
తాను బీసీ మహిళా మంత్రినని పేర్కొన్న ఆమె.. తన భర్త మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారని, తాను పద్మశాలి కులానికి చెందినవారినని తెలిపారు. తమ కులానికి సుమారు 16 శాతం ఓట్లు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.
తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని మంత్రి తెలిపారు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా తనకు అప్పగించిన శాఖను నిర్వహిస్తున్నానని చెప్పారు.
మరోవైపు కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా లేరంటూ వివాదం నడుస్తోందని మంత్రి కొండా సురేఖ ప్రస్తావించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
