కవితమ్మపై అనుచిత పోస్టులు.. చర్యలు తీసుకోవాలి

కరీంనగర్, సెప్టెంబర్ 2:
తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కవితమ్మపై సోషల్ మీడియాలో అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ కరీంనగర్ జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ డిమాండ్ చేశారు.
ఈ మేరకు బుధవారం కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఫేస్బుక్, ఎక్స్ (ట్విట్టర్)తో పాటు ఇతర సోషల్ మీడియా వేదికల్లో కవితమ్మను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొంటూ పోలీస్ కానిస్టేబుల్ కె. అనిల్‌పై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ.. మహిళా నాయకురాలిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం మహిళా లోకాన్ని అవమానించడమేనని అన్నారు. పోలీస్ శాఖలో బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్న వ్యక్తి ఒక మహిళా రాజకీయ నాయకురాలిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు.
కానిస్టేబుల్ అనిల్ చేసినట్లు పేర్కొంటున్న వ్యాఖ్యలపై సమగ్ర విచారణ జరిపించాలని, ఈ వ్యవహారం వెనుక ఎవరైనా ఉన్నారా అనే అంశాన్ని కూడా దర్యాప్తు చేయాలని కోరారు. పోలీస్ శాఖ శాఖాపరమైన విచారణ చేపట్టి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి లింగంపల్లి నాగరాజు, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి అంకం శివరాణి, మానకొండూర్ నియోజకవర్గ ఇన్చార్జి చెన్నమల్ల చైతన్య, చొప్పదండి నియోజకవర్గ నాయకులు మ్యాకల తిరుపతి, జిల్లా పార్టీ నాయకులు రంగరవేణి లక్ష్మణ్, కుతాడి శ్రీనివాస్, శ్రీరాముల రమేష్, బసవేణి రాజేందర్, ఎండి హుస్సేన్, ఎండి రాజీ, మడిపల్లి వినీత్, బాండారి అభిరామ్, జిల్లా మహిళా నాయకురాలు జంగ అపర్ణ, అసియా సుల్తానా, పల్లె శారద, తుట్తేవార్ ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.
Zindagi9News సెప్టెంబర్ 2, 2026
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
