కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌కు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్.. స్టే ఎత్తివేత

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ పథకాల అమలుపై సింగిల్ బెంచ్ విధించిన మధ్యంతర స్టేను తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఎత్తివేసింది. దీంతో రెండు పథకాల అమలుకు ఉన్న తాత్కాలిక న్యాయపరమైన అడ్డంకి తొలగింది.
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు సంబంధించి 2014 నుంచి ప్రభుత్వం జారీ చేసిన పలు జీవోలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సింగిల్ జడ్జి గతంలో మధ్యంతర స్టే విధించారు.
ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ప్రభుత్వ అప్పీల్‌పై విచారణ జరిపిన ధర్మాసనం సింగిల్ బెంచ్ విధించిన స్టేను ఎత్తివేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టు తాజా ఆదేశాలతో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలు కొనసాగించేందుకు మార్గం సుగమమైంది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
