నకిలీ పురుగుమందుల వ్యాపారిపై నిర్బంధం కొనసాగింపు
హైకోర్టులో పిటిషన్ కొట్టివేత.. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్న న్యాయస్థానం

హైదరాబాద్, ఆగస్టు 27 (జిందగీ9న్యూస్): నకిలీ, కల్తీ పురుగుమందుల తయారీ, విక్రయాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ముద్దంగుల ఆదిత్యకు విధించిన నిర్బంధ ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు సమర్థించింది. నిర్బంధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది.నకిలీ పురుగుమందుల వినియోగం వల్ల పంటలు దెబ్బతిని రైతులు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది. ఇలాంటి కార్యకలాపాలు ప్రజా ప్రయోజనాలకు, ప్రజా శాంతికి విఘాతం కలిగించే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది.Telangana Prevention of Dangerous Activities Act కింద ఆదిత్యను ‘ఇన్సెక్టిసైడ్ ఆఫెండర్’గా పరిగణిస్తూ అధికారులు తీసుకున్న చర్యల్లో జోక్యం చేసుకునేందుకు కోర్టు నిరాకరించింది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
