కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఆగస్టు 29న ఎథిక్స్ కమిటీ భేటీ

హైదరాబాద్, ఆగస్టు 26 (జిందగీ9న్యూస్): ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనైతిక ప్రవర్తనపై తెలంగాణ శాసనసభ ఎథిక్స్ కమిటీ ఆగస్టు 29న విచారణ చేపట్టనుంది. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి రెండ్ల తిరుపతి ఆగస్టు 22న అధికారిక లేఖ జారీ చేశారు.లేఖ ప్రకారం.. ఆగస్టు 29న శనివారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ భవనంలోని కమిటీ హాల్ నంబర్–1లో సమావేశం జరగనుంది. 2026 మార్చి 29న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీనియర్ సభ్యుడు కడియం శ్రీహరిపై పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరుపై సభ ఎథిక్స్ కమిటీకి ఈ అంశాన్ని నివేదించింది.ఈ వ్యవహారాన్ని పరిశీలించి, తదుపరి అవసరమైన చర్యలను సిఫారసు చేసేందుకు కమిటీ సమావేశం కానుంది. కమిటీ చైర్మన్, సభ్యులు తప్పనిసరిగా సమావేశానికి హాజరు కావాలని కార్యదర్శి కోరారు.విచారణ అనంతరం కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎలాంటి చర్యలను సిఫారసు చేస్తారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
