ఆటో డ్రైవర్ ఫోన్ నుంచి రూ.17 వేలు కాజేసిన నిందితుడి అరెస్ట్

ఆదిలాబాద్, ఆగస్టు 26 (జిందగీ9న్యూస్): సహాయం పేరుతో ఆటో డ్రైవర్ నుంచి ఫోన్ తీసుకుని, అతని దృష్టి మళ్లించి ఫోన్‌పే ద్వారా రూ.17 వేల నగదును కాజేసిన నిందితుడిని ఆదిలాబాద్ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.పోలీసుల వివరాల ప్రకారం.. రాథోడ్ యువరాజ్ (26) అత్యవసరమని చెప్పి ఆటో డ్రైవర్ ఫోన్ తీసుకున్నాడు. అనంతరం అతని దృష్టి మళ్లించి ఫోన్‌పే ద్వారా సుమారు రూ.17 వేలను తన ఖాతాకు బదిలీ చేసుకున్నాడు.బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ.10 వేల నగదు, నేరానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.నిందితుడిని చాకచక్యంగా అరెస్ట్ చేసిన టూ టౌన్ పోలీసు సిబ్బందిని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్, IPS అభినందించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
