బావిలో పడి యువతి మృతి.. ఇల్లంతకుంటలో విషాదం

ఇల్లంతకుంట, ఆగస్టు 2 (Zindagi9News): కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ యువతి మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసేడు గ్రామానికి చెందిన బోగం ప్రసన్న లక్ష్మి (30) గత కొంతకాలంగా మానసిక రుగ్మతతో బాధపడుతోంది. శనివారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి ఆవరణలోని బావి నుంచి నీళ్లు తోడుకుంటుండగా ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడిపోయింది. నీటిలో మునిగిపోవడంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.మృతురాలి తండ్రి బోగం సంజీవ్ ఫిర్యాదు మేరకు ఇల్లంతకుంట ఎస్సై క్రాంతికుమార్ కేసు నమోదు చేశారు.
