- 11,403 బ్యాంక్ ఉద్యోగాలకు IBPS భారీ నోటిఫికేషన్!

బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త! ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనెల్ సెలెక్షన్ (IBPS) దేశంలోని 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (CSA/క్లర్క్) పోస్టుల భర్తీకి CRP CSA-XVI నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 11,403 ఖాళీలను భర్తీ చేయనుంది. వీటిలో తెలంగాణలో 191, ఆంధ్రప్రదేశ్లో 186 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఆగస్టు 1 నుంచి ఆగస్టు 21, 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
• సంస్థ: ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనెల్ సెలెక్షన్ (IBPS)
• పోస్టు పేరు: Customer Service Associate (CSA/Clerk)
• మొత్తం ఖాళీలు: 11,403
• తెలంగాణ: 191 పోస్టులు
• ఆంధ్రప్రదేశ్: 186 పోస్టులు
అర్హతలు:
• గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
• వయస్సు: 20–28 సంవత్సరాలు
• రిజర్వేషన్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు
ఎంపిక విధానం:
• ప్రిలిమినరీ ఆన్లైన్ పరీక్ష
• మెయిన్స్ ఆన్లైన్ పరీక్ష
• స్థానిక భాష ప్రావీణ్య పరీక్ష (LLPT)
• ఇంటర్వ్యూ లేదు
ముఖ్యమైన తేదీలు:
• దరఖాస్తుల ప్రారంభం: 01-08-2026
• చివరి తేదీ: 21-08-2026
• ప్రిలిమ్స్ పరీక్ష: అక్టోబర్ 2026
• మెయిన్స్ పరీక్ష: డిసెంబర్ 2026
అధికారిక వెబ్సైట్: www.ibps.in
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
