హుజూరాబాద్ ప్రాజెక్ట్‌లో 16 అంగన్వాడీ టీచర్ పోస్టులకు నోటిఫికేషన్
హుజూరాబాద్, ఆగస్టు 1 (Zindagi9news): కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఐసీడీఎస్ (ICDS) ప్రాజెక్ట్ పరిధిలో ఖాళీగా ఉన్న 16 అంగన్వాడీ టీచర్ (AWT) పోస్టుల భర్తీకి మహిళా, శిశు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన మహిళా అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.
ఖాళీల వివరాలు:

- వీణవంక మండలం: కొత్తపల్లి – VH
- సైదాపూర్ మండలం: సైదాపూర్-1 (OC), గొడిశాల-2 (SC Group-II), దుద్దెనపల్లి-1 (SC Group-III), సైదాపూర్-2 (SC Group-II), సర్వాయిపేట (SC Group-III), గొడిశాల-1 (OC)
- జమ్మికుంట మండలం: గండ్రపల్లి (EX-S/OC), నాగంపేట్ (ST), గోవిందాపూర్ (SC Group-II), మొల్లేపల్లి (BC-E), ఒడ్డెరవాడ (BC-A)
- ఇల్లందకుంట మండలం: గడ్డివానిపల్లి (BC-C)
- హుజూరాబాద్ మండలం: శాలపల్లి (EWS), గొల్లపల్లి (BC-D), కుమ్మరివాడ 3వ వార్డు (OC)
అభ్యర్థులు 2026 ఆగస్టు 15 సాయంత్రం 5 గంటలలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసే మహిళలు సంబంధిత గ్రామం లేదా వార్డుకు చెందిన స్థానిక వివాహిత నివాసి అయి ఉండటం తప్పనిసరి.
దరఖాస్తుల కోసం వెబ్సైట్:
https://mis.tgwdcw.in/
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
