పెరుగు ప్యాకెట్లో చనిపోయిన ఎలుక పిల్ల
వరంగల్‌లో కలకలం.. అమ్మకాలు నిలిపివేసిన అధికారులు

వరంగల్, జూన్ 21(Zindagi9news): వరంగల్‌లోని ఎస్ఆర్ఆర్ తోట సమీపంలో పెరుగు ప్యాకెట్లో చనిపోయిన ఎలుక పిల్ల కనిపించడం కలకలం రేపింది. స్థానికంగా ఉన్న ఓ కిరాణా దుకాణంలో ఆదివారం పెరుగు ప్యాకెట్‌ను కొనుగోలు చేసిన ఓ వ్యక్తి ఇంటికి తీసుకెళ్లి ప్యాకెట్‌ను కట్ చేయగా అందులో చనిపోయిన ఎలుక పిల్ల కనిపించింది. దీంతో వెంటనే అతడు కిరాణా షాపు యజమానిని నిలదీసి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న అధికారులు రంగంలోకి దిగి పెరుగు ప్యాకెట్ విక్రయించిన దుకాణాన్ని పరిశీలించారు. అనంతరం అదే బ్యాచ్‌కు సంబంధించిన పెరుగు ప్యాకెట్ల విక్రయాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ తదుపరి విచారణ చేపట్టారు.
