పిల్లనిచ్చిన అత్తతో అల్లుడి వివాహం.. ఉత్తరప్రదేశ్లో వైరల్ ఘటన

ఉత్తరప్రదేశ్, కాన్పూర్ దేహాత్: ప్రేమకు వయసు, బంధుత్వాలకు అతీతమని భావించిన ఓ అల్లుడు తన అత్తతోనే వివాహం చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దేహాత్ జిల్లా అక్బర్పూర్ ప్రాంతంలో వెలుగుచూసింది.
సమాచారం ప్రకారం, కూతురి పెళ్లి అనంతరం తరచూ అత్తగారింటికి వెళ్లే అల్లుడు, క్రమంగా అత్తతో సన్నిహితంగా మారాడు. ఈ పరిచయం ప్రేమగా మారడంతో, ఇద్దరూ పరస్పర అంగీకారంతో ఇళ్ల నుంచి వెళ్లిపోయి కోర్టులో వివాహం చేసుకున్నారు.
ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ, సమాజం ఏమనుకున్నా తమ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వారు వెల్లడించారు. అనంతరం కోర్టు వివాహ ధ్రువీకరణ పత్రంతో కలిసి తీసుకున్న వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేయడంతో అది వైరల్గా మారింది.
తాము ఇష్టపూర్వకంగానే వివాహం చేసుకున్నామని, తమ బంధాన్ని సమాజం అంగీకరించి ఆశీర్వదించాలని ఆ జంట కోరింది.
