ప్రజావాణిలో 144 వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్

కరీంనగర్: జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ప్రజల నుంచి మొత్తం 144 వినతిపత్రాలను స్వీకరించి వారి సమస్యలను శ్రద్ధగా విన్నారు.
ఈ సందర్భంగా వృద్ధులు, దివ్యాంగుల వద్దకే వెళ్లి అర్జీలు స్వీకరించిన కలెక్టర్, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు.
ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రతి ఫిర్యాదుపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు, జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో), స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, జిల్లా ఉపాధి కల్పనాధికారి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
