
జూన్ 12న పాఠశాలల పునఃప్రారంభం.. విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే జూన్ 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో, విద్యార్థులతో పొగాకు, మద్యం, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా కు తెలిపారు.
లోక్‌భవన్‌లో గవర్నర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయిన సీఎం, ఈ విద్యా సంవత్సరం నుంచి పాఠశాలల ప్రారంభం రోజునే విద్యార్థులకు వివిధ వస్తువులతో కూడిన స్టూడెంట్ కిట్ల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు గవర్నర్‌ను ఆహ్వానించారు.
విద్యార్థులకు అందజేయనున్న కిట్లలో యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగ్‌లు, క్రీడా దుస్తులు తదితర అవసరమైన సామగ్రి ఉండనున్నట్లు సీఎం వెల్లడించారు.
అలాగే, పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు డ్రగ్స్, ఇతర వ్యసనాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకునేలా యాజమాన్యాలు చర్యలు చేపడతాయని తెలిపారు. పాఠశాల విద్యాశాఖ, పోలీసు శాఖ, EAGLE సంయుక్త ఆధ్వర్యంలో సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
విద్యాసంస్థలను సురక్షితమైన, డ్రగ్స్ రహిత వాతావరణంగా తీర్చిదిద్దడం, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, యాజమాన్యాల్లో అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని సీఎం గవర్నర్‌కు వివరించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
