
దిల్సుఖ్నగర్లో అర్ధరాత్రి ప్రత్యేక ఆపరేషన్.. 40 మంది ఆకతాయిల అదుపులో
హైదరాబాద్: మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి దిల్సుఖ్నగర్ ప్రాంతంలో అర్ధరాత్రి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. మహిళల భద్రతపై పెరుగుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో స్వయంగా కామన్ లేడీలా రోడ్డుపై నిలబడి పరిస్థితిని పరిశీలించారు.
ఈ సందర్భంగా మహిళలను వేధిస్తూ అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఆకతాయిలపై పోలీసులు నిఘా పెట్టి మొత్తం 40 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
మహిళల భద్రతకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. నగరంలో ఇటువంటి ప్రత్యేక డ్రైవ్లు కొనసాగుతాయని వెల్లడించారు.

