
తెలంగాణలో స్పోర్ట్స్ విభాగం ఆధ్వర్యంలో జాబ్ మేళా – 2026 షెడ్యూల్ విడుదల
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మరో కీలక కార్యక్రమాన్ని ప్రకటించింది. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా స్పోర్ట్స్ విభాగం ఆధ్వర్యంలో “జాబ్ మేళా – 2026” నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో ఈ జాబ్ మేళాలను నిర్వహించనున్నారు.
జాబ్ మేళా తేదీలు – జిల్లాల వారీగా
మే 1 – నల్గొండ
మే 2 – ఖమ్మం
మే 4 – వరంగల్
మే 5 – కరీంనగర్
మే 6 – పెద్దపల్లి
మే 6 – ఆదిలాబాద్
మే 7 – నిజామాబాద్
మే 8 – మెదక్
మే 8 – మహబూబ్‌నగర్
మే 11 – రంగారెడ్డి
మే 12 – హైదరాబాద్
ఈ జాబ్ మేళాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వస్తోంది.
కంపెనీలకు ప్రత్యేక అవకాశం
జాబ్ మేళాలో పాల్గొనాలనుకునే కంపెనీలు QR కోడ్ ద్వారా లేదా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా నమోదు చేసుకోవచ్చు.

- కంపెనీ వివరాలు నమోదు చేసి ఉద్యోగాలను పోస్టు చేయవచ్చు
అభ్యర్థులను సులభంగా ఎంపిక చేసుకోవచ్చు
కేటాయించిన బూత్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించుకునే సౌకర్యం ఉంటుంది
DEET & TASK భాగస్వామ్యం
ఈ కార్యక్రమంలో డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (DEET) మరియు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASK) సంస్థలు భాగస్వామ్యం అవుతున్నాయి.
యువతకు అవకాశాల వేదిక
ఈ జాబ్ మేళా ద్వారా ప్రైవేట్ రంగ సంస్థలు మరియు యువత మధ్య నేరుగా కనెక్ట్ కల్పించడంతో పాటు, నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపే ప్రయత్నంగా ప్రభుత్వం దీన్ని భావిస్తోంది.
ఉపాధి కోసం ఎదురుచూస్తున్న యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
