
అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి రూ.20 వేల విరాళం అందజేసిన పాడి ఉదయ్ నందన్ రెడ్డి
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం వల్బపూర్ గ్రామం లో భారత రాజ్యాంగ నిర్మాత, దళిత జాతుల మహానీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహాన్ని నూతనంగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు మరియు అంబేద్కర్ విగ్రహ కార్యనిర్వహణ కమిటీ నిర్ణయించారు.ఈ నేపథ్యంలో కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, సామాజిక సేవకుడు పాడి ఉదయ్ నందన్ రెడ్డి (Founder & CEO – YuppTV & Turito) రూ.20,000 (ఇరవై వేల రూపాయలు) విరాళంగా అందజేశారు. ఆయన ఈ సహాయంతో మానవతా విలువలకు నిదర్శనంగా నిలిచారని గ్రామస్తులు అభినందించారు.గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం తమ అందరి కల అని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే పాడి ఉదయ్ నందన్ రెడ్డి తన అనుచరుల ద్వారా విరాళం పంపించడం విశేషమని పేర్కొన్నారు. ఆయన దాతృత్వం గ్రామానికి గర్వకారణమని కొనియాడారు.
ఈ సందర్భంగా పాడి ఉదయ్ నందన్ రెడ్డి మాట్లాడుతూ,
“డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చూపిన సమానత్వం, సామాజిక న్యాయం, మానవత్వం నేటికీ మార్గదర్శకాలు. ఆయన స్మారకార్థం విగ్రహం నిర్మించడం అంటే ఆయన ఆశయాలకు నివాళి అర్పించడం. ఈ పవిత్ర కార్యక్రమంలో నా వంతు సహాయం చేయగలిగినందుకు సంతోషంగా ఉంది”
అని తెలిపారు.
విగ్రహ నిర్మాణం వార్త తెలిసి వల్బపూర్ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. అంబేద్కర్ జయంతి అయిన ఏప్రిల్ 14కి ముందే నిర్మాణం పూర్తి చేయాలని కమిటీ లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామ యువత, మహిళలు, పెద్దలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
ప్రతి సంవత్సరం జరుపుకునే అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ విగ్రహ నిర్మాణం గ్రామానికి చారిత్రాత్మకంగా నిలవనుందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహ కార్యనిర్వహణ కమిటీ అధ్యక్షుడు అందే కుమార్, కోశాధికారి పల్లె వేణి గట్టయ్య, జీడి రాజు, కల్వల సదాశివరెడ్డి, మారుమూల బిక్షపతి, మాజీ ఉపసర్పంచ్ మేకల సమ్మిరెడ్డి, వార్డు సభ్యులు పస్తం కుమార్, మంతెన శ్రీధర్, అమృత ప్రభాకర్, సముద్రాల బిక్షపతి, సిరిగిరి శేఖర్, దాసారపు అశోక్, తాళ్లపల్లి కుమారస్వామి, దాసారపు వంశీకృష్ణ, చాంద్ తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
