అద్దె వాహనం కోసం దరఖాస్తుల ఆహ్వానం
కరీంనగర్, ఏప్రిల్ 02(Zindagi9News):
కరీంనగర్ జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయ (మహిళాభివృద్ధి, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ) అవసరాల నిమిత్తం అద్దె ప్రాతిపదికన వాహనాన్ని సమకూర్చుకోవడానికి ఆసక్తి గల యజమానుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి ఎం. సరస్వతి ఒక ప్రకటనలో తెలిపారు.

- గడువు కాలం: 01.04.2026 నుండి 31.03.2027 వరకు (ఒక సంవత్సరం).
- నిబంధనలు: తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక శాఖ సర్కులర్ (నెం. 826/29/A2/DCM/2017) ప్రకారం వాహనం కేటాయించబడుతుంది.
- అందుబాటు: వాహనం మరియు డ్రైవర్ 24×7 గంటలు అందుబాటులో ఉండాలి. ముందస్తు అనుమతి లేకుండా డ్రైవర్ను లేదా వాహనాన్ని మార్చకూడదు.
దరఖాస్తు విధానం:
ఆసక్తి గల వాహన యజమానులు తమ దరఖాస్తులను సీల్డ్ కవర్లో నేరుగా జిల్లా పరిషత్తు కార్యాలయ ప్రాంగణంలోని జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, కరీంనగర్ నందు సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేదీ: 02.04.2026 (నేడు) సాయంత్రం 5:00 గంటల వరకు.
మరిన్ని వివరాలకు కార్యాలయ పని వేళల్లో సంప్రదించాలని, ప్రక్రియను పొడిగించే లేదా రద్దు చేసే పూర్తి అధికారం జిల్లా సంక్షేమ అధికారికి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.
