రేపు హుజురాబాద్లో ‘వార్డు సభల’ సందడి
- 30 వార్డుల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సమీక్ష
- ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం
- పాల్గొనాలని పట్టణ ప్రజలకు కమిషనర్ పిలుపు

హుజురాబాద్, ఏప్రిల్ 01(Zindagi9News):
హుజురాబాద్ మునిసిపాలిటీ పరిధిలో రేపు (గురువారం) వార్డు సభలు నిర్వహించనున్నట్లు కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకగా చేపట్టిన ‘ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక – 99 రోజుల ఆక్షన్ ప్లాన్’ లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గత రెండేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఈ సభలు జరగనున్నాయి.
ప్రజా క్షేత్రంలో ప్రగతి నివేదిక
డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాల మేరకు, పట్టణంలోని మొత్తం 30 వార్డుల్లో ఉదయం 10 గంటలకు ఏకకాలంలో సభలు ప్రారంభమవుతాయి. వార్డుల వారీగా కేటాయించిన పాఠశాలలు, వార్డు కార్యాలయాలు మరియు ప్రముఖ కూడళ్ల వద్ద అధికారులు ఈ సభలను ఏర్పాటు చేశారు. ఆయా వార్డుల అభివృద్ధి పనులు, రాబోయే ప్రణాళికలు మరియు ప్రజా సమస్యలపై ఈ సభల్లో చర్చించనున్నారు.
ఏ వార్డులో ఎక్కడ?
వార్డుల వారీగా సభలు జరిగే ప్రాంతాలు:
వార్డు నెం. సభ నిర్వహించే ప్రాంతం
- 1 కొత్తపల్లి హనుమాన్ టెంపుల్ వద్ద
- 2 గణేష్ నగర్, బతుకమ్మ ఆడు స్థలము వద్ద
- 3 కూర సుదర్శన్ ఇంటి ముందు
- 4 మాజీ సర్పంచ్ ప్రతాప శ్రీనివాస్ ఇంటి ప్రక్కన ఖాళీ స్థలంలో
- 5 పంజాల రాంశంకర్ ఇంటి పక్కన, చౌరస్తా వద్ద
- 6 నల్ల సుమన్ ఇంటి ముందు ఖాళీ స్థలములో
- 7 తమ్సప్ గోడౌన్ వద్ద
- 8 పాదాల బండ వద్ద
- 9 దమ్మక్కపేట వార్డు కార్యాలయము నందు
- 10 & 11 ఇప్పల్ నర్సింగాపూర్ వార్డు కార్యాలయము నందు
- 12 ముక్కపెల్లి క్రీడా మైదానము నందు
- 13 బిట్ల వెంకటేష్ ఇంటి ముందు
- 14 బోర్నపల్లి వార్డు కార్యాలయము నందు
- 15 కొత్తపల్లి వార్డు కార్యాలయము వాటర్ ట్యాంక్ వద్ద
- 16 గ్యాస్ గోదాం వెనకాల, గొర్రె శ్రీకాంత్ ఇంటి వద్ద
- 17 ఉర్దూ భవన్ స్కూల్ వద్ద
- 18 కేసరి శేషయ్య అడ్వకేట్ ఇంటి చౌరస్తా వద్ద
- 19 & 20 రాం గోపాల్ రైస్ మిల్ చౌరస్తా వద్ద
- 21 తిలక్ వాటర్ ప్లాంట్ వద్ద
- 22 “Y” జంక్షన్ కాకతీయ కాలేజీ వద్ద (ఇంటి నెం. 12-282)
- 23 గ్రీన్ సేడ్జ్ స్కూల్ పక్కన
- 24 వార్డు కార్యాలయము వద్ద
- 25 మర్రి వెంకటస్వామి ఇంటి ముందు
- 26 వెంకటేశ్వర టాకీసు నందు
- 27 మార్కెట్ ఏరియా, అనిల్ టెంట్ హౌస్ ముందు (ఇంటి నెం. 15-1)
- 28 రాందేవ్ జనరల్ స్టోర్, కేరళ్ స్కూల్ దగ్గర
- 29 ప్రైమరీ స్కూల్ ప్రక్కన
- 30 బోయినపల్లి ఉమాపతిరావు ఇంటి ముందు ఖాళీ స్థలములో
ఈ వార్డు సభలను పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు. ప్రభుత్వం అందిస్తున్న ఫలాలను ప్రజలకు వివరించడంతో పాటు, క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకోవడానికి ఇదొక మంచి వేదిక అని ఆయన పేర్కొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
