
రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గృహ వినియోగదారులకు సరిపడా గ్యాస్ సరఫరా చేస్తామని చెప్పారు. గ్యాస్‌ను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గృహ వినియోగదారులకు అసౌకర్యం కలిగించే వారిపై ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. బ్లాక్ మార్కెట్ జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆస్పత్రులు మరియు ప్రభుత్వ వసతిగృహాలకు కూడా సరిపడా గ్యాస్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
