
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ – 98 మందికి రూ.38 లక్షలు మంజూరు
హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ (Chief Minister Relief Fund) చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన మొత్తం 98 మంది లబ్ధిదారులకు రూ.38,00,500 మంజూరైనట్లు తెలిపారు.హుజురాబాద్ టౌన్, హుజురాబాద్ మండలం, జమ్మికుంట టౌన్, జమ్మికుంట మండలం, వీణవంక, కమలాపూర్, ఇల్లందకుంట మండలాల వారికి ఈ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
