
హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికలు: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి – కాంగ్రెస్ ఆధిక్యం
హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపాలిటీకి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు శుక్రవారం (13-02-2026) పూర్తయింది. ఈ లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ (INC) తన స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది.
పార్టీల వారీగా ఓట్ల వివరాలు:
మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డులలో మొత్తం 241 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ కాగా, పార్టీల వారీగా అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
INC (కాంగ్రెస్): అత్యధికంగా 90 ఓట్లను సాధించి మొదటి స్థానంలో నిలిచింది.
BRS: 69 ఓట్లతో రెండవ స్థానంలో నిలిచింది.
BJP: 58 ఓట్లను కైవసం చేసుకుంది.
ఇతరులు/స్వతంత్రులు: వివిధ గుర్తులపై పోటీ చేసిన అభ్యర్థులకు మొత్తం 24 ఓట్లు లభించాయి.
