

జమ్మికుంట మున్సిపాలిటీలో రెండో రోజు 88 నామినేషన్లు
జమ్మికుంట:మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జమ్మికుంట మున్సిపాలిటీలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగుతోంది. రెండో రోజు మొత్తం 88 నామినేషన్లు దాఖలైనట్లు మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ ఆయాజ్ తెలిపారు.రెండు రోజుల వ్యవధిలో 30 వార్డుల నుంచి మొత్తం 99 నామినేషన్లు స్వీకరించినట్లు ఆయన వెల్లడించారు. రాజకీయ పార్టీల వారీగా చూస్తే భారతీయ జనతా పార్టీ నుంచి 29, బహుజన్ సమాజ్ పార్టీ నుంచి 1, కాంగ్రెస్ పార్టీ నుంచి 28, భారత రాష్ట్ర సమితి నుంచి 21 నామినేషన్లు దాఖలయ్యాయి.
అలాగే ఇతర రాజకీయ పార్టీల నుంచి 6 నామినేషన్లు, స్వతంత్ర అభ్యర్థులుగా 14 నామినేషన్లు వచ్చినట్లు తెలిపారు. అయితే 29వ వార్డులో ఒక్క నామినేషన్ కూడా దాఖలుకాలేదని కమిషనర్ పేర్కొన్నారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
