
వరంగల్ చౌరస్తాలో కత్తితో వివాహిత హల్చల్
వరంగల్ చౌరస్తాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ వివాహిత జ్యోత్స్న కత్తితో దాడికి యత్నించింది.
భర్త శ్రీకాంత్ దుకాణం వద్దకు అకస్మాత్తుగా కత్తితో చేరిన ఆమె, తనకు రావాల్సిన ఆస్తి, పిల్లలను తనకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ హల్చల్ చేసింది.
భార్య నుంచి తప్పించుకునేందుకు శ్రీకాంత్ తన జ్యువెలరీ షాపులో దాక్కొని డయల్ 100కు ఫోన్ చేయగా, పోలీసులు అక్కడికి చేరుకొని జ్యోత్స్న చేతిలోని కత్తిని లాక్కొన్నారు. అనంతరం ఆమె రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగింది.
తన భర్త అక్రమ సంబంధం పెట్టుకుని విడాకులు ఇస్తున్నాడని జ్యోత్స్న ఆరోపిస్తుండగా, విడాకుల కోసం భర్త ఇప్పటికే కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
