
తోటి మిత్రుడి కుటుంబానికి రూ.1,06,500 ఆర్థిక సహాయం
పెబ్బేరు: శ్రీ రాఘవేంద్ర విద్యా నిలయం, పెబ్బేరు 2011–12 SSC బ్యాచ్‌కు చెందిన తోటి స్నేహితులు తమ బాల్య మిత్రుడు పి. భరత్ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించారు. గతంలో ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందిన భరత్ కుటుంబానికి రూ.1,06,500 నగదు సహాయాన్ని అందజేశారు. భరత్ అకాల మరణం తమను కలచివేసిందని స్నేహితులు పేర్కొంటూ, ఆయన కుటుంబానికి ఎప్పటికీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సహాయాన్ని భరత్ భార్య శిరీష, పిల్లలు మరియు తల్లిదండ్రులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జక్కుల రాఘవేందర్, కుర్వ కేశవులు, వెంకటేష్, మహేష్, భాస్కర్, చెన్నరాయుడు, కురుమూర్తి, రాము, గణేష్, శివ, సత్తి తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
