
రజకుల హక్కుల అవగాహనకు ‘రజక ఆకాంక్ష సభ–5’
నంద్యాల జిల్లా రజక సేవాసంఘం, కర్నూలు జిల్లా రజక సేవాసంఘాల సంయుక్త ఆధ్వర్యంలో రజక ఆకాంక్ష సభ–5 నిర్వహించారు. రజకులకు ఉన్న హక్కులు, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడం ఈ సభ ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు.
చెర్మెన్ మరియు అడ్వకెట్ సావిత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రజక సమాజ అభ్యున్నతికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిగింది. హక్కుల సాధనలో ఐక్యతతో ముందుకు సాగాల్సిన అవసరాన్ని వక్తలు వివరించారు.
ఈ సభకు వాలంటీర్లుగా శివ కృష్ణ, సురేష్, చెందు, కిట్టు, రఘు రాముడు, శివ, మనోహర్, మధు, మోహన్ తదితరులు పాల్గొన్నారు. రజక సోదరులు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేశారు.
