
సికింద్రాబాద్ తహశీల్దార్ కార్యాలయంలో లంచం వ్యవహారం – ఇద్దరు అధికారుల అరెస్ట్
హైదరాబాద్ జిల్లా సికింద్రాబాద్ మండల తహశీల్దార్ కార్యాలయంలో భారీ లంచం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదుదారుని ఆస్తికి సంబంధించిన నోటీసుపై ఎటువంటి ప్రతికూల చర్యలు తీసుకోకుండా ఉండేందుకు రూ.3,00,000/- లంచం డిమాండ్ చేసిన మండల సర్వేయర్ కాలువ కిరణ్కుమార్, చైన్మెన్ మేకల భాస్కర్లను తెలంగాణ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
అధికారులు డిమాండ్ చేసిన మొత్తంలో భాగంగా రూ.1,00,000/- స్వీకరిస్తుండగా ఏసీబీ దాడి చేసి ఇద్దరినీ అదుపులోకి తీసుకుంది. ఈ ఘటనతో తహశీల్దార్ కార్యాలయంలో కలకలం రేగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ వెల్లడించింది.
