
బీఆర్ఎస్ సంచలన నిర్ణయం.. ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్
హైదరాబాద్ (జిందగీ9న్యూస్): బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధికారికంగా నోటును విడుదల చేసింది. ఇటీవల కాలంలో కవిత ప్రవర్తన, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్కి నష్టం కలిగించేలా ఉన్నాయని పార్టీ స్పష్టం చేసింది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు తక్షణమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది.
ఇప్పటికే మాజీ మంత్రి హరీశ్ రావుపై కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల మధ్య కవితపై పార్టీ వేటు వేసిన తీరు బీఆర్ఎస్లో కలకలం రేపుతోంది.
