
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో లంచం కేసు వెలుగులోకి వచ్చింది. భూమి నమోదు, రికార్డుల్లో సవరణల కోసం తహసీల్దార్ చింతకింది లలిత, సర్వేయర్ కోట రవి కలసి ఒక వ్యక్తి వద్ద రూ.1 లక్ష లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో అధికారులు దాడి నిర్వహించారు. ఈ క్రమంలో రూ.50,000 లంచం తీసుకుంటుండగా వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రస్తుతం ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తోంది.
