అట్టహాసంగా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ప్రారంభోత్సవం

జూలూరుపాడు, ఆగస్ట్ 17 (జిందగీ 9 న్యూస్):
మండల పరిధిలోని గుండెపుడి గ్రామంలో గోపికృష్ణ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ను ఈరోజు సురక్ష హాస్పిటల్ డాక్టర్ రుద్ర గౌతమ్ నరేష్, కాళ్లూరి వెంకటేశ్వరరావు అట్టహాసంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ రుద్ర గౌతమ్ నరేష్ మాట్లాడుతూ – “మారుమూల ప్రదేశంలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ప్రారంభించడం ఆనందదాయకం. ఇది ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవా కార్యక్రమాలు చేపట్టాలి. సేవే జీవితం అని భావించి సామాన్య ప్రజలకు మంచి వైద్యం అందించడమే వైద్యుల కర్తవ్యంగా గుర్తించాలి” అని అన్నారు.
కాళ్లూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ – “ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఇప్పటివరకు వైద్యం కోసం జూలూరుపాడు వెళ్లాల్సి వచ్చేది. మా ప్రాంతంలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ప్రారంభించిన హాస్పిటల్ సిబ్బందిని అభినందిస్తున్నాను. ఇక్కడ మెరుగైన వైద్యం అందిస్తూ మంచి పేరు సంపాదించాలి” అని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో సాయి ఎక్స్ల్లెంట్ స్కూల్ కరస్పాండెంట్ ఆరబోయిన కృష్ణ ప్రసాద్, పార్టీ నాయకులు వెంకటేశ్వర్లు, గుండె పిన్ని వెంకటేశ్వర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
