జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన – టాబ్లెట్లు పంపిణీ

హుజురాబాద్, ఆగస్టు 7:
ఆగస్టు 11న జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అధికారి డాక్టర్ జరినా హాజరై, విద్యార్థులకు నులిపురుగుల నివారణపై అవగాహన కల్పించారు.

ఆగస్టు 11 తేదీన కళాశాలలో ఆల్బెండైజల్ టాబ్లెట్లు అందజేయనున్నట్లు తెలిపారు. ఉదయం భోజనం చేసిన విద్యార్థులకే టాబ్లెట్లు ఇవ్వబడుతాయని, అనారోగ్యంతో ఉన్నవారు లేదా ఖాళీ కడుపుతో వచ్చిన వారికి ఇవ్వబోమని స్పష్టంగా చెప్పారు.
ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, నీటి నిల్వలు లేకుండా చూసుకోవడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి అంశాలపై విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ ఆంజనేయ రావు అధ్యక్షత వహించారు. టాబ్లెట్ల వాడకంతో కలిగే లాభాలను వివరించారు. అధ్యాపకులు తులసి దాస్, వాసుదేవరావు, మల్లారెడ్డి, రామరాజు, రాజేశం, రాజశేఖర్, సాయి చరణ్, సుగుణ, సుహాసిని, రేణుక తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
