ఎమ్మార్వో వెంకట్ రెడ్డి చేతుల మీదుగా నోటుబుక్స్ పంపిణీ
జెడ్పీ హై స్కూల్ బిజిగిరి షరీఫ్ విద్యార్థులకు ఉత్సాహం

జమ్మికుంట, ఆగస్టు 7: జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ జెడ్పీ హై స్కూల్ లో మండల రెవెన్యూ అధికారి (ఎంఆర్ఓ) వెంకట్ రెడ్డి చేతుల మీదుగా నోటుబుక్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ, విద్యార్థులు చదువుపై ఆసక్తి చూపిస్తూ మంచి మార్కులు సాధించాలని సూచించారు.
పుస్తకాలు అందుకున్న విద్యార్థులు ఎంఆర్ఓ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల అభ్యున్నతికి అందిస్తున్న సాయాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ మంతెన హేమలత, ఆర్ఐ, హెచ్ఎం, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
