అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్న ఎస్సై ఆవుల తిరుపతి

వీణవంక, జూలై 12 (జిందగీ 9 న్యూస్ – ప్రతినిధి దాట్ల శ్రీనివాస్):
వీణవంక మండలం చల్లూరు-కొండపాక మానేరు వాగు నుంచి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్ల నంబర్లు TS 02 UD 2437, TS 02 AVTR 5942గా గుర్తించారు.
ఈ మేరకు సమాచారం అందుకున్న వీణవంక ఎస్సై ఆవుల తిరుపతి సిబ్బందితో కలిసి అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లను గుర్తించి వాటిని పోలీస్ స్టేషన్కు తరలించారు. ట్రాక్టర్ యజమాని దామెర నర్సయ్య (చల్లూరు) ,సాల్పలా సమ్మయ్య (కొండపాక) లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని, ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై ఆవుల తిరుపతి హెచ్చరించారు.
